Additional SP : విద్యార్థులతో కలిసి యోగ మెడిటేషన్ లో అడిషనల్ ఎస్పీ మౌనిక..!
Additional SP : విద్యార్థులతో కలిసి యోగ మెడిటేషన్ లో అడిషనల్ ఎస్పీ మౌనిక..!
దేవరకొండ , మనసాక్షి :
నల్గొండ జిల్దా దేవరకొండ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల మైదానంలో గురువారం యోగ మెడిటేషన్ అవగాహన కల్పించిన దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక..యోగా చేయడం వల్ల మనసుకి ప్రశాంతత కలుగుతుంది అని దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక అన్నారు. అంతేకాదు మెదడుకు ఏకాగ్రత పెంచడానికి కూడా యోగా సహాయపడుతుంది అన్నారు.
ఈ సందర్భంగా దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి,సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని దేవరకొండ అడిషనల్ ఎస్పి మౌనిక అన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు అన్నారు. అపరిచిత వ్యక్తులు సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దేవరకొండ పట్టణంలో జడ్పీహెచ్ఎస్ (బాలుర ) స్కూల్ మైదానంలో విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాలు, షీ టీం విధులు ,సైబర్ నేరాలు, గంజాయి తో పాటు ఇతర మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు.
డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి రక్షణ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్,సెల్ఫ్ డిఫెన్స్ మహిళల మరియు పిల్లల రక్షణకు ఉన్న చట్టాలు, సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు, లాభాలు గతంలో జరిగిన నేరాలు, నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు. విద్యార్థి దశలో చదువు చాలా ముఖ్యం సోషల్ మీడియాతో పాటు సినిమాలకు అలవాటు పడి విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకోవద్దు అని తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలిసి తెలియని వయసులో ప్రేమ, ఆకర్షణకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసిన యెడల ఎలాంటి వివరాలు తెలపవద్దని స్పష్టం చేశారు. గ్రామాలలో ఎవరైనా అనుమానస్పదంగా తిరగడం కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎవరైనా మహిళలను వేధించడం, అవహేళనగా మాట్లాడటం, ఉద్దేశపూర్వకంగా వెంబడించడం లాంటివి చేస్తే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఈ విధంగా అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరస్తులు పంపే ఎలాంటి లింకులు ఓపెన్ చేయకూడదని సూచించారు.పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు,ముఖ్యంగా బాలలైతే తల్లి నిఘా కచ్చితంగా ఉండాలి. సాధారణంగా 8వ తర గతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ ఉరకలు వేసే వయసు ‘తప్పు’ చేసే అవకాశం ఎక్కువ. అందువల్ల తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
స్నేహ పూర్వకంగా మాట్లాడాలి. పిల్లలు స్కూల్స్, కాలే జీలకు వెళ్లి వస్తున్న ప్పుడు గమనించాలి. వారి తీరుపై తరచుగా చదివే చోట ఆరాతీయాలి.ట్యూషన్ల విషయంలో అప్రమత్తత అవసరం అన్నారు. కార్యక్రమంలో దేవరకొండ స్టేషన్ ఎస్ హెచ్ ఓ నరసింహులు, ఎస్సై కోటేష్, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









