UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
UPI డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు ఎక్కువైతున్నాయి. దాంతో వినియోగదారుల భద్రతకు సంబంధించి NPCI ఎప్పటికప్పుడు కొత్త నియమాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి చెల్లింపు యాప్ ల వినియోగదారులను ఇది ప్రభావితం చేస్తుంది.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI చాలా రోజుల నుంచి మూసివేసిన యూపీఐ కి లింక్ చేయబడిన మొబైల్ నెంబర్లను బ్యాంకు ఖాతా నుండి తొలగిస్తామని తెలిపింది. ఏ బ్యాంకు ఖాతాకు వాడుకలో లేని ఫోన్ నెంబర్ తో లింక్ చేసినట్లయితే అవి కూడా తొలగించనున్నారు. బ్యాంకు లింకులో లేని ఫోన్ నెంబర్లు, వాడుకలో లేని ఫోన్ నెంబర్లతో యూపీఐ లావాదేవీలు చేస్తుంటే వాటిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిలిపివేయనున్నారు.
కొంతకాలంగా సైబర్ నేరాల సంఖ్య వేగవంతంగా పెరుగుతుంది. దానిని దృష్టిలో ఉంచుకొని NPCI ఈ కొత్త నియమ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. నిలిచిపోయిన ఫోన్ నెంబర్ల ద్వారా యూపీఐ బ్యాంకింగ్ సేవలతో సాంకేతిక లోపాలకు కారణాలు అవుతున్నట్లు NPCI పేర్కొంటుంది. నిలిచిపోయిన ఫోన్ నెంబర్ల ద్వారా మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది.
కొంతమందికి కొత్త మొబైల్ నెంబర్ వాడుతున్నప్పటికీ బ్యాంకు ఖాతాకు పాత నెంబర్ తోనే లింక్ చేయబడిన వినియోగదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపబోతుంది. దాంతో పాటు యాక్టివ్ గా లేని మొబైల్ నెంబర్లతో UPI వినియోగిస్తున్న వినియోగదారులు కూడా ఈ సమస్య ఎదుర్కొంటారు. అయితే మీ బ్యాంకు ఖాతా నెంబర్ కు ఇకపై యాక్టివ్ గా లేని నెంబర్ కు లింక్ చేయబడి ఉంటే మీ నెంబర్ ను బ్యాంకు ఖాతాలో అప్డేట్ చేయించుకోండి. లేదంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మీ యూపీఐ సేవలు నిలిచిపోలున్నాయి.
RELEATED NEWS :
- UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!
- UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!
- UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
- Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
- GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !









