Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : రైస్ మిల్లు వద్ద ధాన్యం ట్రాక్టర్ సీరియల్ లో… రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..!

Miryalaguda : రైస్ మిల్లు వద్ద ధాన్యం ట్రాక్టర్ సీరియల్ లో… రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

పండించిన ధాన్యం విక్రయించుకోవడానికి మిర్యాలగూడకు ట్రాక్టర్ లో తీసుకొచ్చిన రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దాసరి జానకి రాములు (50) బచ్చు శ్రీను తో కలిసి ట్రాక్టర్ లో ధాన్యం తీసుకువచ్చారు.

గుంటూరు రోడ్డులో ఉన్న కీర్తి రైస్ మిల్లుకు ధాన్యం తీసుకువచ్చి ట్రాక్టర్ సీరియల్ లో పెట్టారు. రాత్రి సమయం కావడం వల్ల భోజనం చేసి తిరిగి నడుచుకుంటూ ఎనిమిదిన్నర గంటల సమయంలో కీర్తి రైస్ మిల్లుకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆర్టిఓ కార్యాలయం సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ రవి అతివేగంగా నడిపి వెనుక నుంచి ఇద్దరిని ఢీ కొట్టాడు.

దాంతో గాయాలైన వారిని 108 అంబులెన్స్ లో మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జానకిరాములకు బలమైన గాయాలు కావడంతో పట్టణంలోని బాలాజీ హాస్పిటల్ తరలించారు. కాగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. జానకి రాములు కుమారుడు నాగ సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Recharge : బంపర్ ఆఫర్.. కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌ రూ.101నుంచే.. ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌,. నాన్-స్టాప్ క్రికెట్ ..!

  2. District collector : జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రెండు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సీజ్..!

  3. Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!

  4. Huzurnagar : సూర్యాపేట జిల్లాలో సంచలనం కలిగించిన అత్యాచారం, దాడి కేసులో పోలీసుల కీలక చర్య..!

మరిన్ని వార్తలు