TOP STORIESBreaking Newsహైదరాబాద్

UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

UPI డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాల్లు కూడా యూపీఐ సేవలపై కన్నేశారు. దాంతో NPCI ఆదేశాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని మొబైల్ నెంబర్లకు యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి యుపిఐ సేవలు ఫోన్ పే, గూగుల్ పే, పేటియంతో పాటు ఇతర పేమెంట్ యాప్ ల సేవలు నిలిచిపోనున్నాయి. యూపీఐ విభాగంలో ముఖ్యమైనది ఫోన్ నెంబర్. అయితే కొంతమంది ఇన్ యాక్టివ్ అయిన ఫోన్ నెంబర్ తోనే యూపీఐ సేవలను కొనసాగిస్తుంటారు. అంతే కాకుండా బ్యాంకు లింకు లేని మొబైల్ నెంబర్లతో యూపీఐ సేవలను కొనసాగిస్తుంటారు. కొన్ని ఫోన్ నెంబర్లు పనిచేయకపోయినా కూడా వాటిని కొనసాగిస్తున్నారు. అలాంటి వాటి పట్ల NPCI కీలక నిర్ణయం తీసుకుంది.

ఎక్కువ కాలం పాటు వినియోగంలో లేని మొబైల్ నెంబర్లను టెలికం శాఖ వేరొకరికి నెంబర్లు కేటాయిస్తారు. అయినా కూడా అలాంటి వాటికి ఖాతాలను కొనసాగిస్తున్నారు. దానివల్ల అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. దాంతో అలాంటి వాటిని నివారించేందుకుగాను NPCI ఆదేశాల మేరకు గూగుల్ పే, ఫోన్ పే, పేటియం లాంటి యాప్స్ తో పాటు బ్యాంకులు ఇన్ యాక్టివ్ నెంబర్లను తొలగించే పనిలో ఉన్నాయి. వీటన్నింటికీ ఏప్రిల్ 1వ తేదీన నుంచి డిజిటల్ సేవలు బంద్ కానున్నాయి.

Similar News :

మరిన్ని వార్తలు