Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

District collector : విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి.. జిల్లా కలెక్టర్..! 

District collector : విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి.. జిల్లా కలెక్టర్..! 

నల్లగొండ, మన సాక్షి :

విద్యార్థి దశనుండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు బోధించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటుచేసిన నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా జిల్లా కలెక్టర్ తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థుల తెలివితేటలను పరీక్షించారు. గణితం, సైన్స్, సోషల్ , హిందీ , ఇంగ్లీష్ సబ్జెక్టులపై వివిధ రకాల ప్రశ్నలను అడిగారు.

సరైన సమాధానాలు చెప్పిన పిల్లలకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఆయా తరగతి గదులలో విద్యార్థినిలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎండాకాలంలో విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో జంక్ ఫుడ్ తినవద్దని చెప్పారు.

పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ తక్కిన పరీక్షలను బాగా రాయాలని చెబుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని బోధించారు.

MOST READ : 

  1. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  2. District collector : ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!

  3. Hyderabad – Nagarjunasagar : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారి పై పొంచి ఉన్న ప్రమాదం..!

  4. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

మరిన్ని వార్తలు