TOP STORIESBreaking News

TG News : పండుగ వేళ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

TG News : పండుగ వేళ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

శ్రీరామనవమి పండుగ సందర్భంగా తెలంగాణ మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. తెలంగాణ మహిళా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ధాన్యం కొనుగోలు విషయంలో మహిళలకు కేటాయింపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళలకు 50 శాతం కేటాయించాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లతో పాటు గోడౌన్ల నిర్వహణ, రవాణా కూడా మహిళలకే కేటాయించనున్నారు. అందుకుగాను ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు గాను 8218 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. అందులో 4000 కేంద్రాలకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐకెపి కేంద్రాలు, పిఎసిఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వాటిలో మహిళా సంఘాలకు 50 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయించి మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించారు.

MOST READ : 

  1. Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!

  2. Obesity: స్థూలకాయులకు గుడ్ న్యూస్.. లావు తగ్గడం చాలా ఈజీ..!

  3. Health: లంచ్ సమయంలో ఈ ఆహారం తిన్నారో.. అంతే సంగతులు..!

  4. Gold Price : వరుసగా రెండో రోజు పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే..!

  5. Miryalaguda : బలంపియాడ్ పరీక్షలో సెయింట్ జాన్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.!

మరిన్ని వార్తలు