Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో పేదల ఇళ్లలో సన్న బియ్యం పండుగ..!

Miryalaguda : మిర్యాలగూడలో పేదల ఇళ్లలో సన్న బియ్యం పండుగ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. కాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం పేదల ఇళ్లలో సన్న బియ్యం పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పేదల ఇళ్లలో స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి పిలుపు మేరకు పట్టణంలోని అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పేదల ఇళ్లలో భోజనాలు చేసి పండుగ జరుపుకున్నారు. దాంతో మిర్యాలగూడ పట్టణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది.

ఈదులగూడెం, హౌసింగ్ బోర్డు ఐదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి మహిళలతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు.

అదేవిధంగా పట్టణంలోని 24వ వార్డులో సన్న బియ్యం లబ్ధిదారుడు షఫీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్చార్జ్ మొలాల కరుణ, అమృత రెడ్డి ఆధ్వర్యంలో భోజనాలు చేసి పండుగ జరుపుకున్నారు.

అదేవిధంగా 25వ వార్డు లో వార్డు ఇన్చార్జ్ గోదాల జానకి రామ్ రెడ్డి, కవిత ఆధ్వర్యంలో సన్నబియ్యం లబ్ధిదారుల నివాసంలో భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రాథోడ్, సైదులు, పాష, విజయ, వెంకటలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : వామ్మో.. గోల్డ్ ఒకేసారి జంప్.. రూ.29,400లతో ఆల్ టైం రికార్డ్.. తులం ఎంతంటే..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై శుభవార్త.. ఈ పథకానికి మరిన్ని నిధులు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. అడవిదేవులపల్లి లో భార్యను నరికి చంపిన భర్త..!

  5. Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!

మరిన్ని వార్తలు