Suryapet : హంగ్రీ బర్డ్స్ హోటల్ లో ఈగలు బిర్యాని.. రూ.5 వేల జరిమానా..!
Suryapet : హంగ్రీ బర్డ్స్ హోటల్ లో ఈగలు బిర్యాని.. రూ.5 వేల జరిమానా..!
సూర్యాపేట, మన సాక్షి:
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని దురాజ్ పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన హంగ్రీ బర్డ్స్ హోటల్ లో కొందరు వ్యక్తులు భోజనం చేయడానికి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా, బిర్యానీలో ఈగలతో వండిన పదార్థాలను కస్టమర్లకు అందించారు.
ఇదేంటని అడిగిన కస్టమర్లపై హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే విషయమై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు మరియు మున్సిపాల్టీ వారికీ కస్టమర్లు ఫిర్యాదు చేశారు. కస్టమర్ల ఫిర్యాదుమేరకు మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో సంబంధిత హోటల్ ను తనిఖీ చేసి హోటల్ యాజమాన్యానికి రూ:5 వేల పెనాల్టీ వెయిట జరిగింది.
ఈ కార్యక్రమంలో హెల్త్ అస్సిటెంట్ మస్కాపురం సురేష్,ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ సిఏచ్ .శివ ప్రసాద్, జూనియర్ అస్సిటెంట్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Groww: గ్రో రికార్డ్.. ఎన్‌ఎస్‌ఈలో 84 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు..!
-
Suryapet : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కాంటాలకై ఎదురుచూపు.. దళారులను ఆశ్రయిస్తున్న రైతులు..!
-
Mutual Fund : ఆ బ్యాంకు ఇన్వెస్టర్లకు శుభవార్త.. మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు సులభతరం..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల యాక్షన్ ప్లాన్.. జిల్లా కలెక్టర్ సమావేశం..!
-
SBI : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త..!









