Narayanpet : ఈదురు గాలులతో భారీ వర్షం.. విరిగిన విద్యుత్ స్తంభాలు, కూలిన చెట్లు..!
Narayanpet : ఈదురు గాలులతో భారీ వర్షం.. విరిగిన విద్యుత్ స్తంభాలు, కూలిన చెట్లు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో అకాల ఈదురు గాలు మెరుపులతో కూడిన భారీ వర్షంతో సత్య సాయి కాలనీ, ఆర్డిఓ ఆఫీస్ ముందు భాగంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డుపైపడ్డాయి.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్. చిట్టెం.పర్నిక రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్ అధికారులు ఎస్ ఈ వెంకటరమణ, ఏడి శ్రీనివాస్, ఏ ఈ.శ్రీనివాస్ విరిగిన విద్యుత్ స్తంభాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయిస్తున్నారు.
రోడ్డుపై అడ్డంగా పడ్డ చెట్లను తొలగించారు. అలాగే హైదరాబాద్ రోడ్డులో విభాగిని మధ్యలో అమర్చిన 3 లైట్ల స్తంభాలు విరిగి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యం నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
MOST READ :
-
Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!
-
District collector : భూ భారతిలో సమస్య పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దరఖాస్తు.. జిల్లా కలెక్టర్..!
-
Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!
-
TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!










