తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : భూ భారతి తో రైతులందరికి వన్ బి.. కలెక్టర్ వెల్లడి..!

District collector : భూ భారతి తో రైతులందరికి వన్ బి.. కలెక్టర్ వెల్లడి..!

పెన్‌ప‌హాడ్, మన సాక్షి:

భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సత్యా గార్డెన్లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సు లో ఆయన మాట్లాడారు.

ధరణిలో పరిష్కరించలేని సమస్యలు ఉన్నాయని. కలెక్టర్. లేదా కోర్టు ద్వారా పరిష్కరించే విధంగా ఉండేదని అన్నారు. ఇప్పుడు భూభారతి చట్టంతో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని తద్వారా సమస్యను బట్టి తాసిల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కానున్నట్టు తెలిపారు.

2014కు ముందు సాదా కాగితం, బాండ్ పేపర్ పై, భూమిని కొనుగోలు చేసి 12 సంవత్సరాలుగా సాగు చేస్తున్నవారు. దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పట్టాదారు పాస్ పుస్తకం లో అప్డేట్ చేస్తామన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 31న అన్ని గ్రామాల్లో భూభారతి సభలు నిర్వహించి రైతులందరికీ వన్ బి అందజేస్తామన్నారు.

భూభారతి అవగాహన సదస్సులో కొంతమంది మహిళా రైతులు భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా గ్రామాలలో భూ భారతి సదస్సులలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు,

సూర్యాపేట రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు, పెన్ పహాడ్ తాసిల్దార్ ధారావత్ లాలు నాయక్, పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారి జన్జనాల వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ నాయక్, ఏపిఎం అజయ్ నాయక్, ఏ పీ ఓ రవి, పెన్ పహాడ్ ఎస్ ఐ కస్తాల గోపికృష్ణ,, సూర్యాపేట తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తూముల భుజంగరావు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పని చేయాలి.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!

  3. Narayanpet : ఈదురు గాలులతో భారీ వర్షం.. విరిగిన విద్యుత్ స్తంభాలు, కూలిన చెట్లు..!

  4. Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!

  5. TG News : 100 ఏళ్లు పనికొచ్చేలా భూభారతి చట్టం.. జిల్లాకు ఓ మండలం పైలెట్ ప్రాజెక్టు.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

మరిన్ని వార్తలు