తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Devarakonda : ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి..!

Devarakonda : ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి..!

దేవరకొండ, మనసాక్షి :

జమ్మూకాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి మానవత్వానికి మాయని మచ్చ అని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలని జమియత్ ఉలేమా నేత మహ్మద్ ముఫ్తి జావిద్ హుస్సేన్, ఈద్గా కమిటీ అధ్యక్షులు సయ్యద్ అజీమోద్దీన్ లు పిలుపునిచ్చారు.

శుక్రవారం దేవరకొండ పట్టణంలో స్థానిక మక్కా మస్జీద్ చౌరస్తా వద్ద పెహాల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ముస్లిం లు పెద్ద ఎత్తున మానవహారం చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాశవిక దాడిని తీవ్రంగా ఖండించారు అన్నారు. అమాయక పౌరులను హతమార్చడం దారుణం అన్నారు.

దేశం పై దాడి జరిగి ఓ వైపు తల్లదిళ్లుతుంటే.. మరో వైపు దీన్ని రాజకీయ ఉనికి కోసం కొందరు వాడుకోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఉగ్రవాదానికి మతం ఉండదని ఏవరు ఇలా చేసిన క్షమించరానిదని. ఇస్లాం శాంతికి చిహ్నం అని.. ఖురాన్ ప్రవచనాల్లో శాంతి.. ప్రేమ దాన ధర్మం మాత్రమే నేర్పబడుతాయని పేర్కొన్నారు.

ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన ఆత్మీయ కుటుంబ సభ్యులకు ఈ సందర్బంగా సంతాపం ప్రకటించారు. ఇలాంటి ఘాతూకానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమయంలో శాంతి, సామారస్యం కు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహ్మద్ ఫరూఖ్ మౌలానా, సయ్యద్ మాజీద్ మౌలానా, మహ్మద్ రహత్ అలీ, మహ్మద్ ఇలియాస్ పటేల్, మహ్మద్ ఖాజా మైనొద్దీన్, మాజీ కౌన్సిలర్లు తౌఫిక్ ఖాద్రి, యండి ఇల్యాస్, మహ్మద్ ఉమేర్, కలిమ్ అన్సారీ, సయ్యద్ మొయిన్ పాషా, మహ్మద్ రషీద్, ఫహీమ్ బాబా, ఫయాజ్, అకీఫ్, సాజీద్, సత్తార్, అతీక్, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Miryalaguda : భూభారతిలో ప్రతి ఏటా డిసెంబర్ 31న భూముల వివరాల ప్రదర్శన.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  2. SBI Life: సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్..!

  3. Axis Bank: సత్తా చాటిన యాక్సిస్‌ బ్యాంక్‌.. రూ.7,118 కోట్ల లాభం..!

  4. Hyderabad : హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం..!

  5. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

 

మరిన్ని వార్తలు