Miryalaguda : కళాభారతికి కేసిఆర్ పేరు తొలగించడంపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు..!
Miryalaguda : కళాభారతికి కేసిఆర్ పేరు తొలగించడంపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని కేసీ ఆర్ కళాభారతి పేరు మార్చడంతో శుక్రవారం మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యములో కళాభారతి వద్ద బైఠాయించి భారీ నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2006 లో శంకుస్థాపన చేసిన కేసీఆర్ కళాభారతి ని బారాస పాలన వచ్చే వరకు కనీసం 30 శాతం పనులు చేపట్టకుండా నిర్మించి అరకొర పనులు కూడా శిధిలావస్థకు వస్తే నేను ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుంచి దీనిపై ధృష్టి పెట్టి పలుమార్లు కెసిఆర్ ని, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసి మన ప్రాంత కళాకారుల పరిస్థితిని వివరించి పూర్తిగా నిర్మాణం చేపట్టి 2023 అక్టోబర్ ‘2 న కేటీఆర్ మరియు అప్పటి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి చే ప్రారంబించారన్నారు.
ప్రభుత్వం మారిన తరువాత ప్రస్తుత పాలకులు చేయవలసిన అభివృద్ది పనులపై ధృష్టి పెట్టకుండా కూల్చుడు, పేర్లు మార్పు పై ఆలోచిస్తున్నారన్నారు. నేను పదేళ్ళు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏనాడైన ఎటువంటి చర్యలకు పాల్పడలేదని, ప్రజలకు ఏం కావాలో అది చేసే వారే నాయకులు, తప్ప ఇబ్బంది పెట్టె వారు కాదని తెలుసుకోవాలని సూచించారు. దాదాపు 973 కోట్ల రూపాయలు నా హయాంలో మంజూరు చేసి టెండర్లు పిలిచి ఉన్నవి, వాటిని పూర్తి చేస్తే చాలని, ఇంకా మిర్యాలగూడ కు ఏం వద్దని హితవు పలికారు.
వాటిని సంపూర్ణంగా వాడుకోకుండా అన్ని నిధులు క్యాన్సిల్ చేసుకుంటూ పోతే పక్క నియోజకవర్గం వారు తీసుకెళ్తుంటే చూస్తూ ఉండడం తప్ప వీళ్ళు ఏమి చేయలేక పోతున్నారని చెప్పారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయాల నందు మెమోరాండం ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మరలా యధావిధిగా పేరు అమర్చాలని కోరారు.
కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, దుర్గంపూడి నారాయణ రెడ్డి, యడవెల్లి శ్రీనివాస రెడ్డి, ఎండి. మోషీన్ అలీ, ధనావత్ చిట్టిబాబు నాయక్, ధనావత్ బాలాజీ నాయక్, పాలుట్ల బాబయ్య,
మట్టపల్లి సైదయ్య యాదవ్, ఎండి. మాక్ధూమ్ పాషా, అంగోతు హాతీరాం నాయక్, ఎండి. ఇలియాస్ ఖాన్, చిర్ర మల్లయ్య యాదవ్, రాములు గౌడ్, కుర్రా చైతన్య, మహిళా విభాగం నాయకురాళ్ళు పెండ్యాల పద్మ, షెహనాజ్ బేగం, ధనమ్మ, ఉమా, ఎండి. షోయబ్, ఒగ్గు జానయ్య తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం..!
-
Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!
-
FY Results: సీఎస్‌బీ బ్యాంక్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ మార్చి త్రైమాసిక ఫలితాలు..!










