NEET : నీట్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNS అమలు.. జిల్లా ఎస్పీ..!
NEET : నీట్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNS అమలు.. జిల్లా ఎస్పీ..!
నల్లగొండ, మన సాక్షి:
ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు జరగనున్న నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు.
నల్లగొండ జిల్లాలో మొత్తం 2087 మంది పరీక్షకు హాజరు కానున్నారని వీరికి జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో 4 పరీక్ష కేంద్రాలు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేయగా, ఎన్జీ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కేంద్రీయ విద్యాలయాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాల వద్ద 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు.
పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు అని మరియు పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు, వంటివి తీసుకువెళ్లడానికి అనుమతి ఉండదని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద తనిఖీలు నిర్వహించే పోలీసు వారికి సహకరించగలరని పేర్కొన్నారు.
MOST READ :
-
Nalgonda : నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు ఇవి తెచ్చుకోవాలి.. జిల్లా కలెక్టర్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!
-
Miryalaguda : తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు.. దరఖాస్తుల ఆహ్వానం..!
-
Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)









