క్రైంBreaking Newsనల్గొండ

Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస చోరీలు.. రోగుల బెంబేలు.. రంగంలో దిగిన పోలీసులు..!

Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస చోరీలు.. రోగుల బెంబేలు.. రంగంలో దిగిన పోలీసులు..!

దేవరకొండ, మనసాక్షి :

మొన్న సెల్ ఫోన్లు… నిన్న బంగారం.. వరుస చోరీలతో దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులు భయబ్రాంతులకు గురవుతున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈనెల 18వ తేదీన శనివారం రాత్రి ఆస్పత్రికి వచ్చిన రోగులు నిద్రిస్తున్న సమయంలో ఐదు సెల్ ఫోన్లు దొంగలించడం జరిగింది. దొంగలించిన సెల్ ఫోన్ల విలువ సుమారు లక్షల పై గా ఉంటది అంటున్న బాధితులు.

ఆసుపత్రిలో దొంగల హల్ చల్ :

మొబైల్ ఫోన్ సంఘటన మరువక ముందే బంగారం దొంగతనం జరిగింది. అఖిల యన్. దరం సింగ్ గాజి నగర్.. కు చెందిన రోగి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఎండో పెట్రిసెస్ ఆపరేషన్ (వైద్యం) చేపించుకోవడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత అఖిల అనే రోగికు ఆస్పత్రిలో ఐ సి యు వార్డులో షిఫ్ట్ చేయడం జరిగింది.

అఖిల నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దొంగలు వచ్చి మెడలో ఉన్న బంగారు తాడును గుంజడం వలన వెంటనే నిద్ర మేలుకొని పక్కవారికి సమాచారం ఇచ్చే లోపడనే దొంగలు కత్తితో బెదిరించి పారిపోవడం జరిగింది.

మెడలో ఉన్న బంగారు తాడు తెగడంతో ఒక గ్రాము బంగారం తో దొంగ పారిపోవడం జరిగింది. మెడలో ఉన్న తాడు రాకపోవడం వలన దొంగలు పరార్ అయ్యారు. వెంటనే సమాచారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో బాధితులు తెలియజేయడం జరిగింది. రంగంలో దిగిన పోలీసులు రోగుల నుంచి ఫిర్యాదు తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)

  2. Miryalaguda : 15 ఏళ్లుగా నిర్లక్ష్యం.. స్వలాభం కోసం లక్షల దుర్వినియోగం..!

  3. Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!

  4. Rythu : వరి కోయలకు నిప్పు రైతులకు ముప్పు.. ఎందుకో ప్రతి రైతు తెలుసుకోవాల్సిందే..!

  5. TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు