Miryalaguda : ఐఏఎస్ అధికారిని, డాక్టర్ ని అంటూ మోసం.. కిలాడి లేడీ ఆట కట్టు..!
Miryalaguda : ఐఏఎస్ అధికారిని, డాక్టర్ ని అంటూ మోసం.. కిలాడి లేడీ ఆట కట్టు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఓ లేడీ కిలాడి ఐఏఎస్ అధికారిని, డాక్టర్ ను అంటూ ఎంతో కాలంగా డబ్బున్న యువకులను మోసం చేసింది. వారి వద్ద నుంచి లక్షల రూపాయలు గుంజింది. ఆమెపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనప్పటికీ పోలీసులకు కూడా చిక్కలేదు. చివరికి మిర్యాలగూడ పోలీసులు ఆమె ఆట కట్టించారు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన ఓ యువతి కొంతకాలంగా డబ్బున్న యువకులను బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.
గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్ అంటూ హైదరాబాదులోని ఓ డిఎస్పి కి, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని ఓ సి ఐ కి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. గత ఏడాది ఓ వైద్యుడిని బెదిరించి అతని వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. మరో యువకుడిని ఇటీవల డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆమె భాగోతం బయట పెట్టారు. కిలాడి లేడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆ కిలాడీ లేడి పై మలక్ పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్, నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం.
MOST READ :
-
Nalgonda : అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల వసూలు.. నిండా ముంచిన యూనిక్ కంపెనీ.. బాధితుల ఆందోళన..!
-
Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Miryalaguda : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!
-
Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!
-
గంజి నీళ్లే అని పారబోస్తున్నారా.. ఏం చేయాలో తేలుసుకుందాం..!









