District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!
District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!
సూర్యాపేట, మనసాక్షి :
వర్షాకాలం సమీపిస్తున్న సమయం లో రైతులు వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు, ఈ క్రమంలో వ్యవసాయ భూమి హద్దులు, దారి, విస్తీర్ణం, నీటివనరులు లాంటి సమస్యలతో రైతులు తగద పడ్తుంటారని ఈ సందర్భాల్లో రైతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పరస్పరం భౌతిక దాడులకు పూనుకోవద్దు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు సామరస్య ధోరణితో ముందుకెళ్లాలని అన్నారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించుకోవడానికి పెద్ద మనుషుల సమక్షంలో సున్నితంగా సమస్యలను పరిశీలించుకోవాలని , లేదా చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి అన్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అధికారులను ఆశ్రయించాలని , సివిల్ కోర్టులను ఆశ్రయించాలని అన్నారు.
తీవ్రమైన సమస్యల్లో ఉన్న భూముల పైకి కోర్టు ఉత్తర్వులు లేకుండా ఎవరు కూడా వెళ్ళవద్దు అని , భూమిపై సేద్యంలో ఉన్న ఇతరులను ఇబ్బందులు పెట్టవద్దు అన్నారు. పంటలు నష్టం చేయడం, హద్దులు చెరపడం లాంటి క్రిమినల్ చర్యలకు పునుకోవద్దు అని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఒకరికొకరు భౌతిక దాడులకు దిగడం వివాదాలు పెట్టుకోవడం వల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయని తెలిపారు.
సివిల్ కోర్టు ఉత్తర్వులైనటువంటి అడ్వకేట్ కమీషన్, బేల్ లిఫ్ మరియు కోర్టు ద్వారా పోలీస్ ప్రోటక్షన్ లాంటివి పొందాలని అన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
MOST READ :









