తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం అడిగిన డాక్టర్ సస్పెండ్..!
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం అడిగిన డాక్టర్ సస్పెండ్..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :
ట్యూబోక్టమి పేషేంట్ వద్ద లంచం డబ్బులు డిమాండ్ చేసిన మత్తుమందు డాక్టర్ మోహన్ రావు ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంథని సామాజిక ఆసుపత్రి లో మత్తు మందు ప్రత్యేక వైద్యునిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోహన్ రావు రచ్చపల్లి గ్రామానికి చెందిన పేషంట్ కొడాలి భాగ్య నుంచి ట్యూబోక్టమి నిర్వహించేందుకు 5000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ దొరికిపోయారని, ఆ డాక్టర్ పై పలు ఫిర్యాదులు ఇప్పటికే నమోదైన నేపథ్యంలో సదరు మత్తుమందు డాక్టర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.









