TOP STORIESBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం
Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!

Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
నేలకొండపల్లి, మన సాక్షి :
రైతుల సెల్ ఫోన్లు టింగ్..టింగ్ అని మోగుతున్నాయి. రైతు భరోసా నిధులు సోమవారం రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్లైన్ బటన్ నొక్కి వైపు భరోసా నిధులు విడుదల చేశారు. నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గంట వ్యవధిలోనే మీ ఫోన్లు టింగ్ ..టింగ్ అంటాయని ప్రకటించారు. ఆయన చెప్పిన విధంగానే ఫోన్లకు మేసేజీ వచ్చింది. రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు ఎకరాల లోపు రైతులకు అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :









