Rythu Bharosa : మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకం ద్వారా ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయి. సోమవారం రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9000 కోట్ల రూపాయలను రైతు భరోసా కు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమవుతాయని ఆన్‌లైన్ బటన్ నొక్కి ప్రారంభించారు. కాగా తొలి రోజు సోమవారం రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేశారు. కాగా రెండవ రోజు మంగళవారం మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ అయ్యాయి.
ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఎకరానికి 6000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి కోసం రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రెండవ రోజు 1551.89 కోట్ల రూపాయలు 10 .45 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి.
MOST READ NEWS :
-
WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!
-
Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!
-
Alumni : 34 సంవత్సరాల తర్వాత అందరు ఒకేచోట..!









