తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District Collector : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇండ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District Collector : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇండ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

దేవరకొండ, మనసాక్షి :

ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన లబ్దిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఇంటి నిర్మాణ దశల ఆధారంగా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా, దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దేవరకొండ మండలం, కోర్ర తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.

కొర్ర మౌనిక అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకుంటున్నది లేదని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి సిమెంట్, ఇటుక, స్టీల్ ఎక్కడి నుండి తీసుకు వస్తున్నారని అడిగారు.

ఇంటి నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ? అని అడగగా దేవరకొండ నుండి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సామాగ్రిని తెస్తున్నామని,ఇంటి నిర్మాణంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని మౌనిక జిల్లా కలెక్టర్ కు బదులిచ్చారు. బేస్మెంట్ బిల్లు వచ్చిందా? అని అడుగగా, లక్ష రూపాయలు తన అకౌంట్ లో జమయ్యాయి అని మౌనిక తెలిపారు.

కాగా ఇంటి నిర్మాణం లేంటల్ స్థాయికి వచ్చినందున రెండో విడత బిల్లును వెంటనే మంజూరు చేయాలని ఆమె పక్కనే ఉన్న గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలను ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో అప్ లోడ్ చేయాలని అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్లను ఆదేశించారు.

లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఇంటి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకుంటే విడతల వారిగా ప్రభుత్వం బిల్లులను వెంటనే విడుదల చేస్తుందని, నిర్మాణం పూర్తయిన ఇండ్ల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు అప్ లో అప్లోడ్ చేస్తే బిల్లుల చెల్లింపు సైతం అంతే వేగంగా జరుగుతుంది అని చెప్పారు.

గతంలో ఎక్కడ ఉండేవారని? జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా, ఇంతకు ముందు గుడిసె ఉండేదని, ఆ గుడిసె ను తొలగించి దాని స్థానంలో ప్రస్తుతం ఇల్లు నిర్మించుకుంటున్నామని, తాము కూలిపని చేసుకుంటున్నామని, తమకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చి చాలా సహాయం చేసిందని, తమలాంటి వారికి ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

వర్షాలకు అనేక ఇబ్బందులు పడ్డామని, రేకుల గుడిసెలో వర్షం వస్తే కారేదని ,ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నట్లు మౌనిక తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ,ఇతర అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Survey: దోమల అగరబత్తుల తయారీలో నిబంధనలకు పాతర.. అసౌకర్యంలో 67 శాతం ప్రజలు..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!

  3. Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu Bharosa : టింగ్..టింగ్..టింగ్.. మోగుతున్న పోన్లు.. వారికి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు..!

  5. Rythu Bharosa : మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు