Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు డబుల్ బోనంజా.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు డబుల్ బోనంజా.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా డబ్బులు మూడు రోజులుగా రైతు ఖాతాలలో జమ అవుతున్నాయి. తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల పంట పెట్టుబడి సహాయంకుగాను రైతు భరోసా పథకం ద్వారా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో వేసే బటన్ నొక్కి ప్రారంభించారు.
ఇదిలా ఉండగా 2025 జనవరి 26 తేదీన రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా యాసంగి సీజన్ కు గాను రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో రైతులకు అందజేయ లేదు. నాలుగు ఎకరాల వరకు వంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతుల ఖాతాలలో జమ చేశారు. కాగా మిగతా రైతులకు అందజేస్తామని చెప్పినప్పటికీ సాగదీయడంతో గడువు కూడా ముగిసింది. వానాకాలం సీజన్ కూడా వచ్చింది. కాగా వానాకాలం సీజన్ లో రైతు భరోసా డబ్బులను అందరి ఖాతాలలో జమ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా యాసంగి సీజన్ రైతు భరోసా వచ్చిన రైతులకే వానాకాలం సీజన్లో కూడా మళ్లీ భరోసా నిధులు ఖాతాలలో జమ అయ్యాయి. ఏదేమైనా చిన్న సన్నకారు రైతులకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు అందజేసింది. వానాకాలం సీజన్ లో నైనా పంటలు సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసా అందుతుందా..? లేదా? అని రైతులు ఆందోళనలో ఉన్నారు.
MOST READ :
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
Holiday : స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు.. సడన్ గా నిర్ణయం..!
-
Rythu Bharosa : మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ.. బిగ్ అప్డేట్..!









