క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Penpahad : గ్రామాల్లో పోలీస్ ప్రభ భరోసా..!

Penpahad : గ్రామాల్లో పోలీస్ ప్రభ భరోసా..!

పెన్ పహాడ్, మన సాక్షి :

యువత మత్తుకు అలవాటు పడి జీవితాలు చిత్తూ చేసుకోవద్దని గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి పచ్చని సంసారాలను చిందరవందర చేసుకోవద్దని సూర్యాపేట జిల్లా రూరల్ సీఐ రాజశేఖర్ అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లింగాల గ్రామంలో పోలీస్ ప్రభ భరోసా కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ నేరాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అత్యాశకు పోయి ఆర్థిక మోసాల బారిన పడవద్దని సూచించారు. గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం కల్పించడం పోలీస్ ప్రజా భరోసా ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

మహిళలను గౌరవించాలని ,మహిళలు పిల్లలను వేధిస్తే కేసులు నమోదు చేసి జీవితకాలం శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తు ఉంటుందన్నారు, అపరిచితులు ఫోన్ చేసిన సోషల్ మీడియా ద్వారా మెసేజ్ ల ద్వారా చెప్పే మాటలు నమ్మి అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ ఎస్ ఐ కస్తాల గోపికృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు యాదగిరి, మురళీధర్ రెడ్డి, పిసి మహేష్ ప్రజలు పాల్గొన్నారు.

MOST READ ; 

  1. District collector : భూభారతి పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. చట్ట ప్రకారం సమస్యలు పరిష్కరించాలి..!

  2. Wave Fortune: వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌తో ట్యాప్, పే.. యాక్సిస్ బ్యాంక్, బోట్, మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యం..!

  3. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!

  4. Miryalaguda : అధ్వానంగా సాగర్ ఎడమ కాలువ.. నీరు పారేదెలా..!

మరిన్ని వార్తలు