Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకున్నారు. నెల నెల లక్కీ డ్రా పేరిట విలువైన బహుమతులను ఆశ చూపారు. ఊరూరా ఏజెంట్లను పెట్టుకుని మరి కోట్ల రూపాయలు కొల్లగొట్టటమే టార్గెట్ గా పెట్టుకున్నారు.
డ్రా పూర్తయిన వాయిదాలు చెల్లించిన సభ్యులకు వస్తువులు ఇవ్వకుండా శఠగోపురం పెట్టారు ఓ ముగ్గురు కేటుగాళ్లు. వారి ఉచ్చులో చిక్కి మోసపోయిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన ముగ్గురు వ్యక్తులు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో ఆర్కె ఎంటర్ ప్రైజెస్ పేరిట దుకాణం తెరిచారు. అదృష్టం బాగుంటే లక్కీ డ్రా లో విలువైన కార్లు బైక్ లు బంగారు నగలు అన్ని మీవేనంటు ఊదరగొట్టారు.
15 నెలల కాలపరిమితి నెలకు వెయ్యి ప్రతి నెల డ్రా ఈ లక్కీ డ్రా లో మీరే విజేతలని పదిమంది ఏజెంట్ల ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేశారు. మొత్తం మీద 2600 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. మొదట కొంత మందికి గిఫ్టులు అందించి నమ్మించారు. ఆ తర్వాత టార్గెట్ రీచ్ కాగానే బోర్డు తిప్పేసి పత్తా లేకుండా పోయారు.
మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్కీ డ్రా పేరిట అమాయక ప్రజల నుండి (3.90)మూడు కోట్ల, 90 లక్షల పైగా కొల్లగొట్టినట్టు సమాచారం. అయితే డ్రా ముగిసి ఆరు నెలలు అవుతున్న.. గెలిచిన గిఫ్టులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన ఏజెంట్లు, సభ్యులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.
మిర్యాలగూడ కు చెందిన కోటేశ్వరరావు, నరేష్, శ్రీనివాస్ లపై ఫిర్యాదు చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న సదరు కేటగాళ్లు రాజకీయ పలుకుబడితో బాధితులతో రాజీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది.
MOST READ :
-
Miryalaguda : రూ.3 కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే పరార్.. లబోదిబోమంటున్న బాధితులు..!
-
TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!
-
Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!










