తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజావాణి ధరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజావాణి ధరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి..!

జగిత్యాల, (మన సాక్షి)

జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 37  పిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో,కోరుట్ల ఆర్డీఓ, మెట్ పల్లి ఆర్డీవో  వివిధ జిల్లా అధికారులు, తహసీల్దర్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Srisailam : శ్రీశైలంకు భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం.. ఇక గేట్లు ఎత్తుడే..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. మహిళపై ఆర్.ఎం.పి అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి..!

  3. ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

  4. Indiramma Atmiya Bharosa : రైతు కూలీల ఖాతాలలో డబ్బులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. BJP President : తెలంగాణ బిజెపి రథసారధిగా రామచందర్ రావు..!

మరిన్ని వార్తలు