జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

Penpahad : ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు.. ప్రతి ఇంటికి అవకాశం.!

Penpahad : ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు.. ప్రతి ఇంటికి అవకాశం.!

పెన్ పహాడ్, మనసాక్షి:

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబ యజమాని ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారి జన్జనాల వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని అనంతారం గ్రామంలో మంగళవారం స్యాచురేషన్ మోడ్ లో ఇంకుడు గుంతలు నిర్మాణం ప్రారంభించి ఆయన మాట్లాడుతూ 6 ఫీట్ల లోతు ఇంకుడు గుంత ఉండే విధంగా గుంతలో సంబంధించిన మెటీరియల్ కొరకు ఉపాధి హామీ పథకం ద్వారా 6500 ఇస్తుందని ఆయన తెలిపినారు.

ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవడం వలన భూగర్భ జలాలు పైకి వచ్చి నీటి కొరత ఏర్పడదని ఇంకుడు గుంత ఇంట్లో ఉండడం వలన దోమలు రాకుండా నివారించవచ్చని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా రావని ఆయన తెలిపినారు ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ రవి, ఈసి బుచ్చన్న, ఏక స్వామి, టి ఏ అనూష, ఫీల్డ్ అసిస్టెంట్ బేగం, పంచాయతీ కార్యదర్శి సోమయ్య, పాల్గొన్నారు.

MOST READ : 

  1. Pasha Mailaram : పాశ మైలారం ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య.. మృతులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!

  3. Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!

  4. Chervugattu : మాస్టర్ ప్లాన్ ప్రకారం చెర్వుగట్టు అభివృద్ధి..!

మరిన్ని వార్తలు