Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Nalgonda : విద్యార్థుల పట్ల వివక్ష.. ఆల్ఫా స్కూల్ ముందు భారీ ధర్నా..!

Nalgonda : విద్యార్థుల పట్ల వివక్ష.. ఆల్ఫా స్కూల్ ముందు భారీ ధర్నా..!

నల్లగొండ, మనసాక్షి.

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు ఆల్ఫా పాఠశాల యాజమాన్యం వివక్షతకు పాల్పడుతుందనీసరైన బుక్స్ ఇవ్వకుండా దళిత విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు.

శుక్రవారం పేరెంట్స్ తో కలిపి ఆల్ఫా పబ్లిక్ స్కూల్ ముందు పేరెంట్స్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో దళిత విద్యార్థులకు ఉన్నత విద్య చదివించాలనే లక్ష్యం బూడిదలో పోసిన పన్నీరు లాగా మారుతుందనీ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో దళిత విద్యార్థులకు బుక్స్ ఇవ్వకుండా అందరినీ ఒకే క్లాసులో కాకుండా దళిత విద్యార్థులను సపరేట్గా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు.

విద్యార్థులకు సరిగా వసతులు కల్పించకుండా నెల రోజులుగా తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురై విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆల్ఫా స్కూల్ ముందు ధర్నాకు దిగడం జరిగింది ఆల్ఫా స్కూలు యజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ మీ ఇష్టం ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి అని తెలుసుగా ప్రవర్తించారు.

జిల్లా కలెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిడి కలగజేసుకొని సమగ్రంగా విచారణ జరిపి ఆల్ఫా స్కూల్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తను చెప్పిందే వినాలని ధోరణి ప్రదర్శిస్తున్నాయని అన్నారు.

కొద్ది రోజులుగా పెండింగ్ బిల్లులు ఉండొచ్చు కానీ బిల్లులు రాలేదని నేపంతో ఫీజులు కట్టమని పుస్తకాలు కొనుక్కోమని విద్యార్థులను స్కూలు నుండి బయటకు వెళ్లగొడుతున్న పరిస్థితులు ఉన్న కనీసం పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లాలో బిఎఎస్ స్కీమ్ కింద ఉన్న విద్యార్థులకు అందరికీ సమాన విద్యా అందించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు .

ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఉద్యమ పోరాటాలు నిర్వహించవలసి వస్తుందని హెచ్చరించారు ఆల్ఫా స్కూల్ ముందు జరిగే ధర్నా ఎస్సై టు టౌన్ సైదులు వారు విచ్చేసి మాట్లాడిన ఫలితం లేకుండా పోయింది కాబట్టి సోమవారం వరకు పేరెంట్స్ ఓపికతో ఉంటారని లేని పక్షంలో తమ విద్యార్థులను అందరినీ ఆ స్కూలు నుండి పంపితే ఇతర బిఎఎస్ స్కీం కింద స్కూళ్లలో జాయిన్ అవుతామని వారు తెలిపారు.

మా విద్యార్థుల భవిష్యత్తు ఆగం అవుతుందని ఎంతో మనోవేదనకు విద్యార్థినీ విద్యార్థులు గురవుతున్నారని పేరెంట్స్ వాపోయారు. డిడి సోషల్ వెల్ఫేర్ కు తెలియజేయుటకు ప్రయత్నించిన అందుబాటులో లేకుండా ఉన్నారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులు తీసుకోవాలని అన్నారు.

కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ, మండల కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్, పేరెంట్స్ బండారు శంకర్, కత్తుల శివ, టి రవితేజ, రాజు, పేర్ల నరసింహ, కట్టా నవీన్, జి శ్రవణ్ , వెంకటేష్, నాగరాజు, ఎం రజిత, మేడిపల్లి పల్లవి, అరుణ, మేడిపల్లి లక్ష్మీ, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Football : ఓం లెస్ ఫుట్బాల్ వరల్డ్ కప్ కు మద్దిరాల లావణ్య ఎంపిక..!

  2. District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!

  3. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Nalgonda : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి.. మంత్రుల ఉమ్మడి ప్రకటన..!

  5. Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు