Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : పోలీసులకు జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

Miryalaguda : పోలీసులకు జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటూ పని చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాలు, స్థితిగతులు గురించి యస్.ఐ ను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని అన్నారు.

ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.
పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు నేర నియంత్రణకు కృషి చేయాలని, బ్లూ కోల్ట్ , పెట్రో కార్ డ్యూటీ లో ఉన్నప్పుడు 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

పెట్రోలింగ్ సమయంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని, స్టేషన్ పరిధిలో సీసీటీవీల ఏర్పాటుపై దృష్టి సారించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పిడియస్ రైస్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపాలని , పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి గంజాయి తాగే వారిని, వారికి సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, సి.ఐ మోతి రాం, ఎస్.ఐ లు మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. సర్కార్ నిర్ణయం ఇదే..!

  2. Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!

  3. TG News : ఉద్యోగుల పని వేళల పరిమితిలో మార్పు..!

  4. Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

మరిన్ని వార్తలు