TG News : రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా.. ఎందుకో తెలుసా..!
TG News : రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా.. ఎందుకో తెలుసా..!
హైదరాబాద్, మన సాక్షి:
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
పాతబస్తీ కుర్రోడిగా మొదలైన రాహుల్ ప్రస్థానం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ దాకా వెళ్లింది. సొంత కృషితో ఎదిగిన అతడు తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా కూడా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆమేరకు ఇవాళ పాతబస్తీ బోనాల పండగ సందర్భంగా రాహుల్ కు నజరానా ప్రకటించారు.
MOST READ :
-
ACB : రైతు నుంచి రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. ఎడమ కాలువకు నీటి విడుదల..!
-
Big Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!
-
Suspended : అక్రమ ఆస్తులలో సంచలనం.. నల్గొండ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్..!
-
Obesity: అన్నం తింటే బరువు పెరుగుతారా.. నిజమిదే తెలుసుకుందాం..!









