తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావైద్యం

District collector : ఇంత నిర్లక్ష్యమా.. వైద్యులపై జిల్లా కలెక్టర్ సీరియస్..!

District collector : ఇంత నిర్లక్ష్యమా.. వైద్యులపై జిల్లా కలెక్టర్ సీరియస్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ చాలా తక్కువ ఉండటం గమనించిన కలెక్టర్ అక్కడి డాక్టర్ ను వివరణ కోరారు. అలాగే ఎన్ సీ డీ ప్రోగ్రాం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ డీ డీ ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. దాదాపు 6 వేలకు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో గత మార్చి, ఏప్రిల్ నెలలో ఒక్క డెలివరీ కాలేదని రిజిస్టర్ ను చూసి తెలుసుకున్నారు.

ఈ డీ డీ అప్ డేట్ లేకపోవడం, జూలై నెలలో కేవలం రెండు డెలివరీలు మాత్రమే జరిగాయని తెలిసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం చేసుకునేలా మహిళలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. పీ హెచ్ సీ పరిధిలోని 10 సబ్ సెంటర్ల కు గాను 16 మంది డాక్టర్లు ఉన్నా ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎందుకు విజిట్ చేయడం లేదని డాక్టర్ ను ఆమె ప్రశ్నించారు. ఏ ఎన్ సీ, టీబీ, ఎన్ సీ డీ కార్యక్రమాల తీరు సక్రమంగా లేదన్నారు.

పీ హెచ్ సీ పరిధిలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయని ఆరా తీసిన కలెక్టర్ ప్రతీ గురువారం ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఇస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. టాబ్లెట్లు నిల్వ ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనిఖీ సమయంలో ఆస్పత్రి రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడం పై వైద్య సిబ్బందిని నిలదీశారు. సూపర్ వైజర్ కు ఫోన్ చేసి బీరువాలో ఉన్న రిజిస్టర్లను తీసుకోవడం పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ ప్రతీది సూపర్ వైజర్ పై ఆధార పడితే ఎలాగని ప్రశ్నించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు.

గవద బిళ్ళల రుగ్మత తో బాధ పడుతున్న ఓ చిన్న పిల్లాడిని చూసిన కలెక్టర్ వెంటనే ఆ పిల్లాడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్ ను ఆదేశించారు. వ్యాక్సిన్ల ను కిట్లల్లో పెట్టడం చూసిన కలెక్టర్ ఐ ఎల్ ఎఫ్ మిషన్ లేదా అని డాక్టర్ ను ప్రశ్నించగా షాట్ సర్క్యూట్ వల్ల మిషన్ చెడిపోయిందని వైద్య సిబ్బంది సమాధానం ఇవ్వడంతో మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనితీరు మార్చుకోవాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ సున్నితంగా హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కోటకొండ గ్రామంలోని బ్రాహ్మణ వాడలో శీలం రాజేశ్వరి అనే లబ్ధిదారు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. గ్రామానికి మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు అయ్యాయని? ప్రస్తుతం ఎన్ని పునాది, లెంటల్, స్లాబ్ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అయితే గ్రామానికి మొత్తం 31 ఇండ్లు మొదటి విడతలో మంజూరు కాగా, 28 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, వివిధ కారణాలతో మిగతా ఇండ్లు ప్రారంభించలేదని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు బేస్ మెంట్ లెవల్ ను పూర్తి చేసుకుంటేనే డబ్బులు ఖాతాలో జమ అవుతాయని ఆమె తెలిపారు.

MOST READ : 

  1. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

  2. Holiday : రేపు స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు.. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు..!

  3. Liquor Scam : లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. తెలంగాణలో రూ.11 కోట్లు స్వాధీనం..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!

  5. GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు