Miryalaguda : శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి..!
Miryalaguda : శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఎస్పి రాజశేఖర్ రాజు కోరారు. శనివారం మిర్యాలగూడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరు ఆహ్లాద వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అన్ని కులాలు, మతాలు కలిసి మెలసి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చిలుకూరి బాలు, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి, నాయకులు జానకి రామ్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!
-
Dmart : డి మార్ట్ లో అతి తక్కువ చౌక ధరలకు సరుకులు కావాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
-
Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!
-
TG News : మావోయిస్టు సిద్ధాంతకర్త, పార్టీకి బ్యాక్ బోన్.. పాఠాలు నేర్పిన ఆమె లొంగిపోయారు..!
-
PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!










