Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణవిద్య

SRR : పీహెచ్డీ పరిశోధన కేంద్రంగా ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల..!

SRR : పీహెచ్డీ పరిశోధన కేంద్రంగా ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల..!

కరీంనగర్, మనసాక్షి :

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల కరీంనగర్ ను పూర్తిస్థాయి పరిశోధన కేంద్రంగా గుర్తిస్తూ శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు కామర్స్ బాటని విభాగాలలో నూతనంగా పీహెచ్డీ డాక్టరేట్ పరిశోధనలకు పర్యవేక్షకత్వం మార్గదర్శనం చేసే అవకాశం ఉంటుంది.

అలాగే నూతనంగా శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ మూడు విభాగాల్లో విస్తృత పరిశోధనలకు అవకాశం లభిస్తుంది. ఎస్ ఆర్ ఆర్ కళాశాలకు పరిశోధన కేంద్రంగా గుర్తింపునిచ్చి ప్రోత్సహించినందుకు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ పరిశోధనా కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మీసాల మల్లారెడ్డి లు సంయుక్త ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.

టిటిసి జిటిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి కళాశాలలోని బోటనీ కామర్స్ తెలుగు విభాగాల అధిపతులు డాక్టర్ తిరుకోవెల శ్రీనివాస్, టిరాజయ్య ,డాక్టర్ బూర్ల చంద్రశేఖర్ తదితరులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమేష్ కుమార్ తోపాటు రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, జాఫర్ లకు ధన్యవాదాలు తెలిపారు.

MOST READ : 

  1. ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

  2. Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

  3. District collector : భూ భారతి పై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఆ సమస్యలు ఆర్డీవో పరిధిలోనే పరిష్కారం..!

  4. PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు