Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Penpahad : కాంగ్రెస్ ఏజెంట్లకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు..!

Penpahad : కాంగ్రెస్ ఏజెంట్లకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు..!

పెన్ పహాడ్, మన సాక్షి :

ప్రజా పాలనలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని లింగాల గ్రామంలో శనివారం సిపిఎం పార్టీ సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ లింగాల గ్రామంలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్లను పక్కనపెట్టి కాంగ్రెస్ ఏజెంట్లకు మాత్రమే ఇచ్చిందని ఆయన అన్నారు లింగాల టు అన్నారం రోడ్డు నిర్వహించాలని అన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు రోజురోజుకు పేరుకు పోతున్నాయి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్నారు. మండలంలో ఉన్న భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇవ్వాలన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు.

మండల పరిధిలో చీదేల గ్రామంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు పంచి పెట్టాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. డ్రైనేజీ రోడ్లవెంటనే సిసి రోడ్లు నిర్మించాలన్నారు. శాస్త్రీయ పద్ధతులలో వార్డుల విభజన జరిపి ఎన్నికలు నిర్వహించాలన్నారు. రైతులకు యూరియా అందుబాటులో ఉండాలని అన్నారు.

లేకుంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి రణపంగ బుచ్చి రాములు, మాజీ ఉపసర్పంచ్ మామిడి బిక్షం గౌడ్. మాజీ వార్డు నెంబర్ రణపంగ పుల్లయ్య, లోడంగి మధు రణపంగ అనీలు నవనీత. సైదులు. సురేషు. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతుల క్యూ.. ఒక్క బస్తా కూడా దొరక్క ఇక్కట్లు..! 

  2. Green Banana : పచ్చి అరటికాయ తినొచ్చా.. ఎలా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం.. తెలుసుకుందాం..!

  3. Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!

  4. Health : ఆరోగ్య సేవల్లో సరికొత్త అధ్యాయం.. ఐఐహెచ్ హెల్త్‌కేర్ ‘కేర్. ఫర్ గుడ్’ బ్రాండ్..!

  5. Tamarind : చింతపండుతో ఆరోగ్యమేనా.. తెలుసుకోండి..! 

మరిన్ని వార్తలు