Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Minister Komatireddy : దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..!

Minister Komatireddy : దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం..!

నల్లగొండ, మన సాక్షి :

ఉపాధ్యాయ దినోత్సవం దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సన్మానించారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీతలకు ఆయన శుభాకాంక్షలు తెలియ చేసిన అనంతరం మాట్లాడుతూ సమాజంలో అమ్మా,నాన్నల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారని ,గురువు గొప్పతనాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి బాగా చాటి చెప్పారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. అంధకారాన్ని తొలగించి అజ్ఞానం స్థానంలో జ్ఞానాన్ని బోధించే గొప్ప వ్యక్తి గురువని అన్నారు. అలాంటి గురువుల ద్వారా సమాజానికి అవసరమయ్యే భావి భారత పౌరులను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుందని అన్నారు.

తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలోనే పోటీపడే విధంగా ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు నల్గొండలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. డి ఎస్ సి ద్వారా ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టి విద్యావ్యవస్థను పటిష్టం చేశామని, పాఠశాలలు, విద్యాసంస్థలలో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులకు శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహించి మెరుగైన బోధన అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత గురువులపై ఉందని, అలాంటి గురువులు సమాజంలో గొప్పవారని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదని, ప్రభుత్వం విద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నదని ,ప్రత్యేకించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ తరహాలో సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తుండడం పట్ల ఆయన మంత్రిని అభినందించారు.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, విద్యార్థులను ప్రత్యేకించి మారుమూల ప్రాంత విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులతో కోరారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల కృషి వల్లనే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 12 శాతం విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే జిల్లాలో ఎక్కడ లేని విధంగా భవిత కేంద్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, దీని ద్వారా మానసిక వికలాంగుల పిల్లలకుఎంతోఉపయోగకరమని అన్నారు.

తాను జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రారంభమైన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలెక్షన్లను విజయవంతం చేయడంలో ఉపాధ్యాయుల
పాత్ర మర్చిపోలేనిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతిస్తున్నదని, ఇందులో భాగంగానే జిల్లాలో విద్యాభివృద్ధి కి గాను మైనింగ్ ద్వారా వచ్చే నిధులలో 70 శాతం విద్యాశాఖ కి 30 ఖర్చు పెట్టాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తే విద్యార్థుల గుండెల్లో నిలిచిపోతారన్నారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.మరో ఎమ్ ఎల్ సి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సమాజానికి దిశా ,దశ , నిర్దేశం చేసేది ఉపాధ్యాయుడేనని అన్నారు. అవార్డులతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం పై దృష్టి సారించాలని కోరారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ ఎస్పీ రమేష్ ,నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి, డిఈఓ బిక్షపతి ,మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

MOST READ : 

  1. Hyderabad : హైదరాబాద్‌లో కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభం..!

  2. Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..! 

  3. Unispace : హైదరాబాద్ లోనే గృహ రూపకల్పన, భవన పరిష్కారాల కోసం.. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం అపర్ణ యునిస్పేస్..!

  4. TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!

  5. Peanuts : వేరుశెనగలు ఎన్ని తినాలి.. ఎక్కువ తింటే గుండెకు ప్రమాదమా..!

మరిన్ని వార్తలు