Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : సెయింట్ జాన్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం..!

Miryalaguda : సెయింట్ జాన్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం..!

మిర్యాలగూడ , మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో ఉన్న సెయింట్ జాన్స్ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాలకు చెందిన 70 మంది విద్యార్థులు చాచా నెహ్రూ, మహాత్మా గాంధీ, రుద్రమదేవి, సోల్జర్స్, డాక్టర్స్, కలెక్టర్లు, గోపికమ్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉపాధ్యాయుల వేషాదరణలో ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాల్యం భగవంతుడు ఇచ్చిన వరం.. బాల్యంలో సరైన మార్గంలో పయనిస్తే మన దేశ కీర్తి పతాకపు రెపరెపలు ప్రపంచానికి కనిపిస్తాయి అన్నారు. ప్రపంచంలోనే మన దేశానికి అత్యున్నత స్థానం ఉందన్నారు.

మా పాఠశాలలో చదివే విద్యార్థులకు సరైన విద్యతో పాటు క్రమశిక్షణ మంచి నడవడికను నేర్పిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష మాట్లాడుతూ దేశ స్వాతంత్రంలో చాచా నెహ్రూజీ పాత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

MOST READ : 

TG News : జూబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ముగిసిన ఐదు రౌండ్లు..!

Jubilee Hills : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం.. ప్రతి రౌండ్ లోను ఆదిత్యం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం.. 20 మంది ఉన్న పత్తి కూలీల ఆటో బోల్తా..!

Amangal : 120 కిలోల నల్ల బెల్లం, 120 కిలోల పట్టిక పట్టివేత.. ఇద్దరి నిందితుల అరెస్టు..!

మరిన్ని వార్తలు