BREAKING : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!

BREAKING : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!
కేతేపల్లి, మనసాక్షి :
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపాడు గ్రామంలో జాతీయ రహదారి 65 పైన సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడని కేతేపల్లి ఎస్సై యు సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కొర్లపాడు గ్రామానికి చెందిన అనుముల నరేష్ (37 ) కొర్లపహాడ్ గ్రామంలో రోడ్డు దాటుచుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న కార్ డ్రైవరు అజాగ్రత్తగా, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి రోడ్డు దాటుతున్న నరేష్ కు ఢీకొట్టగా, కుడి చేయి, కుడికాలు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయని, గ్రామస్తులు వెంటనే క్షతగాత్రుడు ని అంబులెన్స్ లో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించుతుండగా మృతి చెందాడని తెలిపారు.
మృతుని భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు గలరని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
MOST READ :









