Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా..!

Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా..!
నల్లగొండ, మన సాక్షి:
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. కనగల్ మండలం సమసాత్మక గ్రామము జి.ఎడవెల్లి సందర్శించి అక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, యువకులకు ఎన్నికల నియమాలకు సంబంధించిన అంశాల పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తుందని,ఎవరైనా గొడవలకు కారకులు అయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధం అని తెలుపారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టే మధ్యం, నగదు ఉచితాలు పంపిణి చేయకూడని అన్నారు.
ఎవరైనా అలాంటి చర్యలకు పట్టుబడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు ఎస్పి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, చండూరు సిఐ ఆదిరెడ్డి, కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి, ప్రశాంత్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










