Miryalaguda : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి..!

Miryalaguda : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి..!
మిర్యాలగూడ/వేములపల్లి, మన సాక్షి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ఆమనగల్లు,లక్ష్మీదేవి గూడెం, రావులపెంట,సల్కనూరు, మంగాపురం గ్రామంలో బా.రా.స పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకై ఇంటింటి ప్రచారాన్ని హోరెత్తించారు.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ పదేండ్ల లో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్ళిందన్నారు. రేవంత్ సర్కార్ పాలన పట్ల గ్రామాల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత నమోదవుతోందన్నారు. టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని గ్రామాలన్నీ మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకే మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. రేవంత్ పాలనలో విసిగిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల పితామహుడు కేసీఆర్ అని కొనియాడారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన కేసీఆర్ అడుగుజాడల్లో పయనించేందుకు యువత ముందుకు రావాలని కోరారు.కార్యక్రమంలో నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పేరాల కృపాకర్ రావు, పేరాల గురువ రావు, నంద్యాల శ్రీరామ్ రెడ్డి, బిక్షం, వెంకటేశ్వర్లు, జగన్, గడ్డం వెంకన్న, శోభన్ బాబు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
MOST READ
-
Local Body Elections : ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ధనావత్ లక్ష్మి..!
-
Local Body Elections : పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ ఎన్నికలు.. జోరుగా పందేలు..!
-
CM Revanth Reddy : స్క్రిప్ట్ తో వస్తే చాలు.. సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..!
-
ACB : రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఇంచార్జ్ ఏఈ..!









