Nalgonda : పీపుల్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్, ఆవిర్భావం..!
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పరువు హత్య కేసుల బాధితుల కు అండగా నిలిచి వారికి న్యాయం చేసేందుకు పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంస్థను స్థాపించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది దర్శనం నరసింహ తెలిపారు.

Nalgonda : పీపుల్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్, ఆవిర్భావం..!
నల్లగొండ, మన సాక్షి.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పరువు హత్య కేసుల బాధితుల కు అండగా నిలిచి వారికి న్యాయం చేసేందుకు పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంస్థను స్థాపించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది దర్శనం నరసింహ తెలిపారు.
సోమవారం పట్టణంలోని శివాజీ నగర్ లో ఒక ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాలకు బాధితులకు మధ్యన దూరం ఏర్పడిందని దానిని తొలగించడానికి అణగారిన వర్గాలకు ఆదివాసీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. భారత రాజ్యాంగం 50% కూడా అమలు కావడం లేదని దీనికి ప్రభుత్వ పాలకులు అధికారులు కారణమన్నారు.
రాజ్యాంగబద్ధంగా బడుగు బలహీన వర్గాలకు సంక్రమించే హక్కులపై బాధ్యతలపై సంపూర్ణ అవగాహన కలిగిస్తామన్నారు. పరువుహత్యలపై బాధితులకు శిక్షలు పడటం లేదని దీనికి కారణం కేసులు సంవత్సరాలపాటు సాగదీయడం విచారణ సక్రమంగా జరగకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయన్నారు. పరువుహత్యలపై స్పెషల్ యాక్ట్ రావాలన్నారు.
పరువుహత్యల బాధితుల కమిటీ ఎస్సీ ఎస్టీ బాధితుల కమిటీ బాధితులతోనే వేస్తామన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు రోజు రోజుకు విశ్వాసం సన్నగిల్లుతుందని దీనికి కారణం తీర్పులు త్వరగా రాకపోవడమే అన్నారు. ప్రభుత్వం కేసుల తగ్గట్టు జడ్జీలను నియమించడం లేదని దీంతో జడ్జీలపై ఒత్తిడి పెరిగి కేసులు త్వరగా పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వం పెండింగ్ కేసుల తగ్గట్టు జడ్జీలను నియమించాలన్నారు.
బాధితుల తరఫున ప్రశ్నించే గొంతుక లేనందున ప్రజలు న్యాయ వ్యవస్థ పై ప్రజలు అపోహలకు గురవుతున్నారన్నారు. పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ సంస్థ బాధితుల తరఫున చివరి వరకు పోరాడటానికి వారికి అన్ని రకాలుగా అండగా ఉండటానికి పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో బీఎస్పీ లీగల్చల్ నల్గొండ ఇంచార్జ్ దున్న లింగస్వామి తోడిపర్తి శ్రీకాంత్ కుర్ర గిరి గంధం లింగయ్య కట్టెల శివ తదితరులు పాల్గొన్నారు.









