Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణ

సామాజిక బాధ్యతకు ప్రతీక మనసాక్షి.. సినీ నటుడు సుమన్..!

సమాజంలో వేగంగా జరుగుతున్న మార్పులు, పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న జీవనశైలి మధ్య కూడా సామాన్యుడి జీవితం, అతని శ్రమ, అతని పాత్ర మరుగున పడిపోకుండా చూపించాల్సిన బాధ్యత పత్రికలదేనని టాలీవుడ్ సినీ నటుడు సుమన్ స్పష్టం చేశారు.

సామాజిక బాధ్యతకు ప్రతీక మనసాక్షి.. సినీ నటుడు సుమన్..!

శంకర్‌పల్లి, మన సాక్షి:

సమాజంలో వేగంగా జరుగుతున్న మార్పులు, పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న జీవనశైలి మధ్య కూడా సామాన్యుడి జీవితం, అతని శ్రమ, అతని పాత్ర మరుగున పడిపోకుండా చూపించాల్సిన బాధ్యత పత్రికలదేనని టాలీవుడ్ సినీ నటుడు సుమన్ స్పష్టం చేశారు.

ప్రజల దైనందిన జీవితాలతో ముడిపడిన అంశాలను కేంద్రంగా చేసుకుని రూపొందించిన మన సాక్షి 2026 వార్షిక క్యాలెండర్ ను శనివారం ఆయన శంకర్‌పల్లి మండల కేంద్రంలో ఆవిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పత్రికలు కేవలం వార్తలను ప్రచురించడానికే పరిమితం కాకుండా సమాజానికి దిశానిర్దేశం చేసే వేదికలుగా నిలవాలన్న ఆలోచనకు మన సాక్షి క్యాలెండర్ స్పష్టమైన ప్రతిరూపంగా నిలుస్తోందన్నారు. స్థానిక జర్నలిస్టు గండేటి రాజేష్ గౌడ్ ను సినీ హీరో అభినందించారు.

MOST READ:

  1. District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి..!

  2. అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల..!

  3. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

  4. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు