Nalgonda : పేద మెడికల్ స్టూడెంట్స్ కి ఆర్థిక సహాయం..!

Nalgonda : పేద మెడికల్ స్టూడెంట్స్ కి ఆర్థిక సహాయం..!
నల్లగొండ, మన సాక్షి :
ఎంబిబిఎస్ కోర్స్ చదువుతున్న పేద విద్యార్థులకు వైఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఆ ఫౌండేషన్ జిల్లా కార్యాలయంలో ఆర్థిక సాయం అందించారు. నలగొండ సూర్యపేట జిల్లాలకు చెందిన సుమారు 19 మంది మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులకు సుమారు 4 లక్షల రూపాయలను వైఆర్పి ఫౌండేషన్ చైర్మన్ కుమారుడు ఎలిశాల శరత్ దంపతులు అందజేశారు.
ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ వై ఆర్ పి ఫౌండేషన్ చైర్మన్ రవి ప్రసాద్ సహకారంతో ఎంబిబిఎస్ చదువుతున్న పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకొని డాక్టర్లుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు.
వై ఆర్ పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో వై ఆర్ పి ఫౌండేషన్ ఇంచార్జ్ యామ దయాకర్, మాజీ కౌన్సిలర్ యమ కవిత దయాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.









