Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

MARATHON : మారథాన్‌ – 2026లో ప్రతిభ.. డీఎస్పీనీ అభినందించిన ఎస్పీ..!

ముంబై మారథాన్–2026లో నారాయణపేట జిల్లా నుండి డిసిఆర్బి డీఎస్పీ మహేష్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.

MARATHON : మారథాన్‌ – 2026లో ప్రతిభ.. డీఎస్పీనీ అభినందించిన ఎస్పీ..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:

ముంబై మారథాన్–2026లో నారాయణపేట జిల్లా నుండి డిసిఆర్బి డీఎస్పీ మహేష్ పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. టాటా ముంబై మారథాన్ (42.197 కిలోమీటర్లు) లాంగ్ రన్‌లో పాల్గొన్న ఆయన, 5 గంటల 21 నిమిషాలు 30 సెకండ్లు అనే ఉత్తమ టైమింగ్‌తో మారథాన్‌ను విజయవం తంగా పూర్తి చేసి రెండు మెడ ల్స్ సాధించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మెడల్స్ తో సత్కరించి అభి నందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
పోలీస్ విధులతో పాటు శారీ రక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లోనూ అత్యు త్తమ ప్రతిభ కనబరచడం డీఎస్పీ మహేష్ ప్రత్యేకత అని అన్నారు.

ఆయన సాధించిన విజయం యువతకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆద ర్శంగా నిలుస్తుందని పేర్కొ న్నారు. నిరంతర సాధనతో క్రీడల్లో ముందుకు సాగుతూ జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చినందుకు డీఎస్పీ మహేష్‌ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఆయన సాధించిన ఈ ఘనవిజయం నారాయణ పేట జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని, జిల్లా అధి కారులు, పోలీస్ సిబ్బంది, క్రీడాభిమానులు ఆయనను హృదయపూర్వకంగా అభి నందించారు.

భవిష్యత్తులో మరిన్ని మారథాన్ రన్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్ల పు లింగయ్య ముంబై మార థాన్ రెండు మెడల్స్ సాధిం చిన డీఎస్పీ మహేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.

By : Ramakanth, Narayanpet Town

MOST READ ; 

  1. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

  2. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

  3. Suryapet : సూర్యాపేట పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఎట్ డోర్ స్టెప్ నూతన కార్యక్రమం.. బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరణ..!

  4. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు