Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి పిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకొవాలి..!

ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి పిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకొవాలి..!

సూర్యాపేట :

ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.

ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, వివిధ శాఖలలో చాలా కాలం పెండింగ్ లో ఉన్న పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని అలాగే రాష్ట్ర స్థాయి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 25 దరఖాస్తులు,జిల్లా పంచాయతీ అధికారి 7, డి డబ్ల్యు ఓ 7, వైద్య ఆరోగ్య శాఖ అధికారి 6, మిగిలిన 38 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 83 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, ఇన్చార్జి సీఈఓ శిరీష, ఆర్డీవో వేణుమాధవ్ రావు, డిఏఓ శ్రీధర్ రెడ్డి, సిపిఓ కిషన్, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి సీతారాం నాయక్, డిఇఓ అశోక్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, కే. దయానంద రాణి, నరసింహ, అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు