Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
BREAKING : తెలంగాణలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు బోల్తా, స్పాట్ లో నలుగురు మృతి..!
తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందారు.

BREAKING : తెలంగాణలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు బోల్తా, స్పాట్ లో నలుగురు మృతి..!
మన సాక్షి :
తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తాపడటంతో నలుగురు మృతి చెందారు.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు 22 మంది ప్రయాణికులతో ప్రైవేట్ బస్సు బయలుదేరింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరి కొంతమందికి గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ









