Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునిజామాబాద్

BREAKING : ఆలూర్ లో దొంగతనం కలకలం, భారీ దొంగతనం..!

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు, బీరువాలో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రెండు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.

BREAKING : ఆలూర్ లో దొంగతనం కలకలం, భారీ దొంగతనం..!

ఆర్మూర్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు, బీరువాలో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రెండు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన తలారి జమున (60),ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంత్రం తమ ఇంటికి తాళం వేసి, జుక్కల్‌లో ఉంటున్న చిన్న కుమారుడి వద్దకు వెళ్లారు. శుక్రవారం ఉదయం పొరుగువారు గమనించగా, ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే జమున కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

తాము ఇంకా ఇంటికి రాలేదని బాధితులు చెప్పడంతో దొంగతనం జరిగినట్లు నిర్ధారణ అయింది. బాధితులు వెంటనే గ్రామానికి చేరుకుని లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లోని సామాగ్రి అంతా చిందరవందరగా పడి ఉంది. దొంగలు డికోల మంచాలను వెతికి బీరువాలను పగులగొట్టి,అందులో దాచిన 10 తులాల బంగారం. రూ. 2 లక్షల నగదును అపహరించుకుపోయారు.

పంతులాల బంగారంలో మూడు తులాల తీగ,నక్లెస్ రెండు తులాలు నర, 2 తులాల నర పుస్తెలు తాడు, రెండు బంగారు గాజులు రెండు తులాలు, రెండు లక్షల రూపాయలు అపహరించుకుపోయారు. బాధితుల వివరాల ప్రకారం ఆర్మూర్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు