Hyderabad : ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..10 నెలల తర్వాత వెలుగులోకి..!
ప్రియుడితో కలిసి తల్లిని అతి దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన ఘటన హైదరాబాద్ లోని జవహార్ నగర్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన పది నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.

Hyderabad : ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..10 నెలల తర్వాత వెలుగులోకి..!
మన సాక్షి, హైదరాబాద్ :
ప్రియుడితో కలిసి తల్లిని అతి దారుణంగా హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టిన ఘటన హైదరాబాద్ లోని జవహార్ నగర్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన పది నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. భర్త లేకపోయినా ఇద్దరు కూతుళ్లను ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది. చిన్న కూతురు ఇషిక తన ప్రియుడు మౌంటీరాజు తో కలిసి పది నెలల క్రితం తల్లి అంజూ (45) హత్య చేశారు. తన ప్రేమకు అడ్డు వస్తుందని ప్రియుడితో కలిసి పథకం ప్రకారం ఇంట్లోనే కత్తితో పొడిచి హత్య చేసి బెడ్ రూమ్ లోని బండలు తీసి పూడ్చిపెట్టారు. ఆ స్థలంలో దేవుని ప్రతిమలు కూడా ఉంచారు.
కాగా పెద్ద కూతురు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పది నెలల క్రితమే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద కూతురు కూడా ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకొని సమీపంలోనే ఉంటున్నారు. ఈ విషయంపై తన చెల్లిని అనేక పర్యాయాలు ప్రశ్నించినప్పటికీ సమాధానం చెప్పలేదు.
అంజు పేరుతో ఉన్న స్కూటీ దొరకడంతో పోలీసులు విచారణ చేయగా తన తల్లిని తానే హత్య చేసినట్లు ఇషిక ఒప్పుకుంది. దాంతో బుధవారం పోలీసులు అంజూ మృతదేహాన్ని వెలుగులోకి తీశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.