TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

TS : దర్గాలో సీతారాముల కళ్యాణం.. ఫలహారం తిని వెళ్లిన ఉడుత.. (వీడియో)

సీతారాముల కళ్యాణం హిందూ ముస్లింలు కలిసి అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలహారంలో ఉడుత వచ్చితిని వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది.

TS : దర్గాలో సీతారాముల కళ్యాణం.. ఫలహారం తిని వెళ్లిన ఉడుత.. (వీడియో)

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సీతారాముల కళ్యాణం హిందూ ముస్లింలు కలిసి అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలహారంలో ఉడుత వచ్చితిని వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని నాగుల్ మీరా దర్గాలో జరిగింది.

నాగుల్ మీరా దర్గాలో హిందూ ముస్లింలు కలిసి శుక్రవారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫలహారాలను ఉడుత వచ్చి భుజించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం ఈ దర్గాలో జరిగే శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాల్లో ఉడుత వచ్చి ఫలహారం స్వీకరిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఉడత వచ్చి ఫలహారం తిని వెళ్లినట్లు పేర్కొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు