Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. జాతీయ రహదారిపై ఢీకొన్న రెండు బస్సులు..!
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్నాయి. సూర్యపేట జిల్లా మునగాల మండలం ఆకు పాముల వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి.

Suryapet : సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. జాతీయ రహదారిపై ఢీకొన్న రెండు బస్సులు..!
మన సాక్షి సూర్యాపేట
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్నాయి. సూర్యపేట జిల్లా మునగాల మండలం ఆకు పాముల వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో రెండు బస్సులు ఒకసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో రెండు బస్సులలో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి క్షేమంగా బయటికి తీశారు.









