విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు.. కఠినంగా శిక్షించాలని డిమాండ్..!
విద్యార్థిని పట్ల అసభ్యకరం గా ప్రవర్తించిన ఉపాధ్యాయు లను కఠినంగా శిక్షించాలని పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు.. కఠినంగా శిక్షించాలని డిమాండ్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి:
విద్యార్థిని పట్ల అసభ్యకరం గా ప్రవర్తించిన ఉపాధ్యాయు లను కఠినంగా శిక్షించాలని పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని మోమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా, అవమానకరంగా అమానుషంగా ప్రవర్తించిన పాఠ శాల ఉపాధ్యాయుడు, అదే స్కూల్లో చదువుతున్న మరో మైనర్ విద్యార్థికి వీడియోను పంపించిన మరో టీచర్ ను కూడా సస్పెండ్ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు విద్యార్థులకు తెలియకుండా కంప్యూటర్ రూంలో సీసీ కెమెరా బిగించి విద్యార్థిని వ్యక్తిగత గోప్యత కు గౌరవానికి భంగం కలిగించేలా.. కనీసం విద్యార్థిని ముఖాన్ని బ్లర్ చేయకుండా సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంబంధిత పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యం గా ప్రవర్తించిన వారిని శాశ్వతంగా విధులు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
పుట్టినప్పటి నుండి ఎన్నో సామాజిక అవరోధాలను వివక్షతను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బాలికలు చదువుకుంటుంటే మిగతా తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పాఠశాలలో, పని ప్రదేశాలలో బాలిక లు, మహిళలు ముఖ్యంగా దళితుల పట్ల నిరంతరంగా దాడులు కొనసాగుతున్నాయని అన్నారు.









