ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయం

AP : సీఎం చంద్రబాబు కీలక ఆదేశం.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం..!

అన్నమయ్య జిల్లా ఒంటి మిట్ట తిరుమల లాగా ప్రసద్ది చెందేలా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

AP : సీఎం చంద్రబాబు కీలక ఆదేశం.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం..!

  • స్పెషల్ ఎకనామిక్ జోన్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు

  • నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా కలెక్టర్, టిటిడి అధికారులతో ఒంటిమిట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష

రామసముద్రం, మనసాక్షి

అన్నమయ్య జిల్లా ఒంటి మిట్ట తిరుమల లాగా ప్రసద్ది చెందేలా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను తీర్చి దిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.
గురువారం ఒంటిమిట్ట స్టేట్ గెస్ట్ హౌస్ నందు నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ టిటిడి జేఈవో గార్లతో ఒంటిమిట్ట అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.

ఒంటిమిట్ట, రాజంపేట నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తో ప్రత్యేకంగా చర్చించారు. ఒంటిమిట్ట పవిత్ర పుణ్యక్షేత్రం నందు అభివృద్ధితో పాటు స్థానికంగా కూడా ఉపాధి అవకాశాలను పెంచేలా ఉండాలన్నారు.యువతకు ఉపాధి కల్పించేలా,పరిశ్రమల ఏర్పాటు చేసి సంపద సృష్టించే కేంద్రంగా ఒంటిమిట్ట ఒంటిమిట్టను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

అదేవిధంగా జాంబవంతుని విగ్రహం ఏర్పాటు చేసే ఐలాండ్ తో పాటు అన్ని ముఖ్య ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు వేద పండితుల సూచనలు సలహారమేరకు ఉండాలన్నారు. ఒంటిమిట్ట గ్రామానికి ఒక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

MOST READ : 

మరిన్ని వార్తలు