Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలి..!

జిల్లాలో ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు పెండింగ్ లో లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అభివృద్ధి పనులు త్వరిగతిన పూర్తి చేయాలి..!

నల్లగొండ, మన సాక్షి

జిల్లాలో ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు పెండింగ్ లో లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ సెంటర్ భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడలు, ఫుడ్ స్టోరేజ్ గోడౌన్‌లు, అమ్మ ఆదర్శ పాఠశాల భవనాలు, ఆర్&బి భవనాలు తదితర నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

అన్ని భవనాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంపై దృష్టి పెట్టాలని, హాస్టళ్లు, పాఠశాలల్లో టాయిలెట్స్, కిచెన్‌లు, త్రాగునీటి సదుపాయాలు, ఆర్‌ఓ ప్లాంట్లు సమర్థంగా పనిచేసేలా చూసుకోవాలని చెప్పారు.చిన్న మరమ్మత్తులు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు.

స్కూల్ టాయిలెట్స్ ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, పిల్లలకు రక్షణ ఉండేలా ప్రహరీగోడ నిర్మించాలని, అంగన్వాడి పాఠశాలల పనులు క్వాలిటీ గా ఉండాలని, ప్రభుత్వ భవనాల నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు సమృద్ధిగా అందించాలని, బోర్లకు ఏమైనా మరమ్మతులు ఉంటే బాగుచేయించుకోవాలని, నీటి సరఫరా లో లీకేజీ లేకుండా రిపేర్ చేయించాలిని, నీటి సరఫరా లో ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు .

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సమయానికి పూర్తైతేనే ప్రజలకు పూర్తిస్థాయి ప్రయోజనం అందుతుందని, అందుకు అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశానికి జిల్లా పరిషత్ సి ఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ యస్ ఈ రామచంద్రారెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి ,ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు